Thursday, April 25, 2024

కర్నాటక ఎన్నికలు: 124 అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఎన్నికలకు 124 అభ్యర్థుల తన తొలి జాబితాను విడుదల చేసింది. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి కర్నాటక అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సీటు మైసూరు జిల్లాలో ఉంది. సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా సిద్ద రామయ్య మరో నియోజకవర్గం నుంచి కూడా టికెట్‌ను కోరుకుంటున్నారు. బహుశా అది రెండో జాబితా ప్రకటించినప్పుడు తెలియవచ్చు. సిద్దరామయ్య సన్నిహిత వర్గాల భోగట్టా ప్రకారం ఆయన బాదామీ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేయవచ్చు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో కాక ఓటింగ్ మిషిన్లతోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అలాగైతే బిజెపికి సానుకూలతలెక్కువ కావొచ్చునని కొందరంటున్నారు.

నియోజకవర్గంలో ఎక్కువగా ప్రచారం చేయకుండానే సునాయాసంగా గెలువచ్చనే అభిప్రాయంతోనే వరుణ నియోజకవర్గం టికెట్‌ను సిద్దరామయ్యకు ఇచ్చారు. కాగా బిజెపి మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడియూరప్ప కుమారుడు బి.వై. విజయేంద్రను ఇక్క పోటీకి నిలుపవచ్చు. వరుణ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉండగలదని తెలుస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత ధ్రువనారాయణ కుమారుడు దర్శన్ ధ్రువనారాయణకు నంజన్‌గుడా(ఎస్సీ) నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అక్కడ ఆయన బిజెపి అభ్యర్థి బి. హర్షవర్ధన్‌తో తీవ్రంగా తలపడనున్నారు. హర్షవర్ధన్ మాజీ కేంద్ర మంత్రి వి. శ్రీనివాస ప్రసాద్ కుమారుడు. ఐదుగురు ముస్లిం అభ్యర్థులకు…యు.టి. ఖాదర్(ఉల్లాల), బి.జె.జమీర్ అహ్మద్ ఖాన్(చామరాజ్‌పేట్), రహీమ్ ఖాన్(బీదర్), కనీజ్ ఫాతిమా(గుల్బర్గా నార్త్) కూడా టిక్కెట్లు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News