Monday, August 4, 2025

బిసిలు సగభాగం ఉన్నారు… రాజకీయంగా అంతే దక్కాలి: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమాజంలో సగభాగం బిసిలు ఉన్నారని, వాళ్లకు రాజకీయంగా సగ భాగం దక్కాలని ఎంఎల్‌సి కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఇవాళ చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఎంఎల్‌సి కవిత ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బిఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టుగా బిసిలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలని, ఆర్థిక అవకాశాలు రావాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కావాలని కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బిజెపిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తోందని కవిత దుయ్యబట్టారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News