Thursday, April 25, 2024

అబద్ధం రాజ్యమేలుతోంది: కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇడి ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ విషయంలో ఇడి నోటీసులపై ఎంఎల్‌సి కవిత స్పందించారు. ఇడి విచారణను ఎదుర్కొంటామన్నారు. రేపు ఇడి అడిగే ప్రశ్నలకు అన్నింటికి సమాధానాలు చెబుతానని, 9న తనని విచారణకు రమ్మన్నారని, కానీ 11న వస్తానని చెప్పానన్నారు. కానీ ఇడి తన విజ్ఞప్తిని పట్టించుకోలేదని కవిత దుయ్యబట్టారు. అధికారంలో లేని రాష్ట్రాలలో మోడీ కంటే ముందు ఇడి వస్తుందని ఎద్దేవా చేశారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరని ప్రశ్నించారు. కావాలంటే నిందితుల్ని తన ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరామన్నారు. ఇడి ఏం అడిగినా సమాధానం చెబుతానన్నారు.

ఉద్యమం చేసి వచ్చామని, భయపడేవాళ్లం కాదన్నారు. ఇడి దర్యాప్తుకు వంద శాతం సహకరిస్తానని వివరించారు. తెలంగాణ నేతలను వేధించడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, మోడీ వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీం తెచ్చారని కవిత దుయ్యబట్టారు. రేపు జంతర్ మంతర్ వద్ద ఐదు వందల మందితో దీక్షలో పాల్గొంటానని చెప్పారు. ఇడి కమ్యూనికేషన్ గురించి మాట్లాడాలనుకున్నామని, తనని ఎవరిని విచారించిన తనకు ఇబ్బందిలేదన్నారు. మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని, విపక్షాలను ఇడితో మోడీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్నారు. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధాల రాజ్యమేలుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News