Thursday, April 25, 2024

డిగ్రీలేని వ్యక్తికేమో అత్యున్నత ఉద్యోగం: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -
దేశంలో నిరుద్యోగం రేటు 7.8 శాతం

న్యూఢిల్లీ: తెలంగాణ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శలు చేశారు. మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ట్వీట్ చేశారు.

‘ దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి. కానీ దీన్ని పట్టించుకుంటున్నారా? యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి చేస్తున్నారా? నేడు భారతదేశంలో ఉన్న వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికేమో అత్యున్నతమైన ఉద్యోగం దక్కింది’ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఎంఎల్ సి కవిత తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News