Monday, May 19, 2025

కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కెసిఆర్ భరోసా

- Advertisement -
- Advertisement -

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కెసిఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.వైద్యవిద్యలో ఆసక్తికనబరిచిన ప్రియాంకను ఇప్పటికే కెసిఆర్ ఎంబిబిఎస్ చదివించారు. ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని పి.జి చేస్తున్న డా. ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్యా పిల్లలకు కెసిఆర్ అందజేశారు.

ఈ మేరకు ఆదివారం నాడు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు.కాగా… అమరుడు కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయాన్ని తెలుసుకున్న కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కెసిఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News