Thursday, April 25, 2024

కెసిఆర్ మా స్టార్ క్యాంపెయినర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కర్నాటకలో జరగనున్న అ సెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ (జనతాదళ్ సెక్యులర్) పార్టీ పక్షాన స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టి ఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు దిగబోతున్నారు. ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కెసిఆర్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జెడిఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారికంగా కర్నాటకలో ఒక ప్రకటన చేశారు. తమ విజ్ఞప్తు మేరకు జెడిఎస్ పక్షాన ప్రచారం చేయడానికి కెసిఆర్ అంగీకరించారని కుమారస్వామి పేర్కొన్నారు. ఇది తమకు రాజకీయంగా బాగా కలిసివస్తుందన్నారు. జెడిఎస్ పార్టీ అదనపు బలం చేకూరుతుందన్నారు. కెసిఆర్ ఇచ్చే అండదండంతో వచ్చే ఎన్నికల్లో జెడిఎస్ పార్టీ సంపూ ర్ణ మెజార్టీ సాధించి.. కైవసం చేసుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలకు కెసిఆర్ ఒక్కరే ప్రత్యామ్నయంగా కనిపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ సారధ్యంలోని బిఆర్‌ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించడం ఖాయమని కుమారస్వామి అన్నారు. కర్నాటకలో జరగనున్న ఎన్నికల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న కల్యాణ కర్నాటక (ఒకప్పటి హైదరాబాదు కర్ణాటక ప్రాంతం)లోని పలు జిల్లాల్లో జరిగే బహిరంగ సభలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈసారి జెడిఎస్ పక్షాన కెసిఆర్‌తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు జాతీయ నేతలు కూడా రానున్నారని కుమారస్వామి విడుదల చేసిన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని అయితే ప్రజాతీర్పును తుంగలో తొక్కే లా బిజెపి ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తోందని ఈ సందర్భంగా కుమారస్వామి ఆరోపించారు. ఇటీవల తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారీ కుట్ర జరుగడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ విలువులను పూర్తిగా నాశనం చేస్తోందని పేర్కొనేందుకు అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడమేనని కుమారస్వామి పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న మోడీ పాలనకు దేశ ప్రజలు చరమగీతం పాడేందుకు తగు సమయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నాటకకు జలాలు, భాష ఉద్యోగాల విషయంలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించిన ఆయన…..కర్నాటక ప్రజలు జెడిఎస్‌కు పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెడితే తమ సత్తా చూపుతామని ఒక ప్రకటనలో కుమారస్వామి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News