Tuesday, June 18, 2024

ఢిల్లీ ప్రజలు పాకిస్థానీయుల్లా కనిపిస్తున్నారా?: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య వాగ్వాదాలు జోరు పెరుగుతోంది. నరేంద్రమోడీ వారసుడిగా అమిత్‌షా ఎన్నికైన కారణం గానే ఆయన దురహంకారం ప్రదర్శిస్తున్నారని , తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్‌షా పోలుస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్, రాహుల్‌వంటి నేతలు ఇండియా కంటే పాకిస్థాన్‌నే ఎక్కువగా మద్దతు చేస్తున్నారంటూ దక్షిణ ఢిల్లీలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ మంగళవారం నాడు తిప్పికొట్టారు. అమిత్‌షా సోమవారం నాడు ఢిల్లీ వచ్చారని, ఆయన ర్యాలీకి 500 మంది కంటే తక్కువ మంది హాజరయ్యారని అన్నారు. అమిత్‌షా తన ప్రసంగంలో దేశ ప్రజలపై నోరు పారేసుకున్నారని, ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేవారు పాకిస్థానీయులంటూ మాట్లాడారని చెప్పారు.

ఢిల్లీ ప్రజలు ఆప్‌కు 62 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, 56 శాతం ఓటింగ్‌లో భాగం ఇచ్చారని, వారంతా పాకిస్థానీయులా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే పంజాబ్ ప్రజలు 117 సీట్లలో 92 సీట్లు ఆప్‌కే ఇచ్చారని, వారు పాకిస్థానీయులా అని నిలదీశారు. గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్,సహా దేశం లోని పలు రాష్ట్రాల్లో ప్రజలు ఆప్‌ను ఆదరించారని, వారు కూడా పాకిస్థానీయులా అని అమిత్‌షాకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం నాడు పూర్తయిన ఐదో విడత పోలింగ్ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా కూటమికి 300 కు పైగా సీట్లు వస్తాయని సర్వేలన్నీ చెబుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News