Monday, December 2, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

నిందితుల బెయిల్ పిటిషన్లు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో రాధాకిషన్ రావు , భుజంగరావు కీలక నిందితులుగా ఉన్నారు. వీరి బెయిల్ గడువు ముగియడంతో మరోసారి బెయిల్ కోరుతూ విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు.

సోమవారం వీరి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయగా, భుజంగరావు పిటిషన్ ను ఈ నెల 28న విచారించాలని నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవలే పలువురు బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎలకు కూడా నోటీసులు అందాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో ఎంతటి వారున్న వదిలేది లేదని స్పష్టపర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News