Saturday, October 12, 2024

మీ నాయకులను కట్టడి చేయండి:ఖర్గే

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్షంగా చేసుకుని కొందరు బిజెపి నాయకులులతోపాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన కొందరు సభ్యులు చేస్తున్న అభ్యంతరకర, హింసాత్మక వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అభ్యంతరం తెలియచేస్తూ మీ నాయకులను కట్టడి చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం ఒక లేఖ రాశారు. భారత రాజకీయాలు దిగజారకుండా నివారించేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే స్పష్టం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రత్యక్షంగా సంబంధించిన ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఖర్గే తన లేఖలో తెలిపారు.

బిజెపి, మీ మిత్రపక్షాల నాయకులు ఉపయోగిస్తున్న భాష భవిష్యత్తుకు చాలా హనికరమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి(రవనీత్ సింగ్ బిట్టూ), బిజెపి పాలిత యుపి రాష్ట్ర మంత్రి(రఘురాజ్ సింగ్) లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని నంబర్ ఒన్ ఉగ్రవాదిఅంటూ ఆరోపించడంపై ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందిందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మీ మిత్రపక్షమైన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రిజర్వేషన్ విధానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు బహుమానం ఇస్తానని ప్రకటించారని మోడీకి రాసిన లేఖలో ఖర్గే ప్రస్తావించారు. మీ నాయన్మకు పట్టిన గతే నీకూ పడుతుందంటూ ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు ఒకరు రాహుల్ గాంధీని హెచ్చరించారని ఖర్గే గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News