Friday, April 19, 2024

కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు కుమార్తేనా ?

- Advertisement -
- Advertisement -

సియోల్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్‌జుయేతో కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె కూడా ఉన్నారు. భవిష్యత్ నేత ఆమె అవుతారని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఆమె వయసు 10 సంవత్సరాలు. త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తర కొరియా తమ అణ్వాయుధ సామర్థాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ , సైన్యం లోని ప్రముఖులతో భేటీ కావడం విశేషం. కుమార్తెతో కలిసి కిమ్ కనిపించడం ఇది నాలుగోసారి. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం కిమ్‌జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ ఆఫీసర్స్ లాడ్జింగ్ క్వార్టర్స్‌ను మంగళవారం సందర్శించారు.

అనంతరం జరిగిన విందులో రక్షణ దళాలను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచం లో బలమైన సైన్యంగా నిలుస్తున్నందుకు ప్రశంసించారు. యుద్ధ సన్నద్ధతను మరింత పెంచుకునేందుకు విన్యాసాలను పెంచాలని ఆదేశించారు. ఆయుధాల ప్రదర్శనను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. ఈ విందు ప్యాంగ్యాంగ్ లోని యాంగక్టో హోటల్‌లో జరిగింది. కిమ్ ఆయన సతీమణి, ఆయన కుమార్తె కలిసి ఎర్ర తివాచీపై నడుస్తూ వస్తున్న ఫోటోలను స్టేట్ మీడియా ప్రచురించింది. కిమ్ ఆయన కుమార్తె తెలుపు రంగు చొక్కాలు, నల్లని రంగు సూట్స్ ధరించారు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చున్నారు. ఆమె గౌరవనీయమైన , ప్రియాతిప్రియమైన అధినేత కుమార్తె అని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ఈ విందుకు సీనియర్ మిలిటరీ అధికారులు హాజరయ్యారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ అణ్వాయుధాగారంలో కొత్త రకం క్షిపణి ప్రదర్శన వచ్చే నెలలో జరుగుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News