Saturday, April 20, 2024

లవ్, యాక్షన్ డ్రామా షురూ..

- Advertisement -
- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా శివం సెల్యులాయిడ్స్ పతాకంపై ఒక సరికొత్త లవ్, యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు.

ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, శిరీష్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోదర ప్రసాద్, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెలలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News