Sunday, June 16, 2024

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ భస్మాసుర అస్త్రం పెట్టింది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పాలన కూడా కెసిఆర్ పాలన మాదిరే ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనూ ప్రజావ్యతిరేక విధానాలు ఉన్నాయని, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ నిజాం వారసులేనని, తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ భస్మాసుర అస్త్రం పెట్టిందని, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో అని అడిగారు. ధాన్యం సేకరణకు ప్రతిపైసా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంటే రైతుల్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు ఉద్యమం చేశామని, ఇప్పడు తెలంగాణను రక్షించుకోవడం కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా  పెరుగుతాయన్నారు. ఆర్ జి ట్యాక్స్, ఆర్ ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ ఏమైందని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News