Thursday, October 10, 2024

విడిపోయిన మరో జంట.. భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో

- Advertisement -
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. విడాకులు తీసుకుంటన్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ జంట ఎవరనుకుంటున్నారా?.. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి-ఆర్తి దంపతులే. గత కొన్ని రోజులుగా వీరిద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ పుకార్లే నిజమయ్యాయి.

తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం జయం రవి ఓ లేఖ విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించేలా వార్తలు ప్రచారం చేయొద్దని రవి కోరారు.

కాగా.. ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె అయిన ఆర్తిని జయం రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2009లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 2003లో జయం సినిమాతో రవి హీరోగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో అలరిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News