Wednesday, June 19, 2024

సహజీవనం కేసు.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు

- Advertisement -
- Advertisement -

సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కొమురెల్లి ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కొమురెల్లి ఎస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు ఇతరులతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీ జోన్ 1 ఐజిపి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News