Sunday, April 28, 2024

దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -
  • 32 తులాల బంగారం, 23 తులాల వెండి, లక్ష 17వేల నగదు స్వాధీనం
  • నిందితులను రిమాండ్‌కు తరలింపు

కొమురవెల్లి: కొమురవెల్లి దేవస్థానం వద్ద మూడు రో జుల క్రితం అంబడపల్లి అర్చన భర్త నాగరాజు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అందులో 32 తులా బంగారం, 23 తులాల వెండి, లక్ష 17 వేల రూపాయల నగదును ఆపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందుతున్ని కొండూపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు ఇంట్లో ప్లంబర్ పని చేయడానికి వచ్చిన కొమురవెల్లి గ్రామానికి చెందిన మల్లేశం (38) ఎవరు లేని సమయంలో ఇ ంట్లోకి చోరబడి బంగారం, వెండి, డబ్బును దొంగలించాడని తెలిపారు.

గత మూడు రోజుల నుంచి కొమురవెల్లి ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యం లో గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కొండపాక మ ండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిం దితున్ని పట్టుకొని అతని వద్ద ఉన్న బంగారం, వెండి, డబ్బును స్వాధీ నం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు చేదించిన పోలీస్ సిబ్బందిని సిఐ సత్యనారాయణ రెడ్డి అభినందించారు. త్వరలోనే రివార్డు గురించి ఉన్నతాధికారులకు ప్రపోజల్ పంపిస్తామని తెలిపారు. సిఐ మాట్లాడుతూ ఎవరు కూడా ఎక్కువ బంగారాన్ని డబ్బులను అధిక మొత్తంలో ఇంట్లో పెట్టుకోకూడదని బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు. వారి వెంట ఎఎస్‌ఐ రామమూర్తి, కానిస్టేబుల్ తిరుపతి, సిద్దులు, సతీష్, మానన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News