Sunday, October 1, 2023

నిరుపేదలకు కొండంత అండ సిఎం సహాయ నిధి

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: సీఎం కేసీఆర్ సహాయ నిధి నుంచి పేదలకు అందుతున్న ఆర్థిక సహాయం కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. పటాన్ చెరు జిహెచ్‌ఎంసి పరిధి లోని బండలగూడకు చెందిన బాయమ్మకు రు. 2 లక్షల సిఎంఆర్‌ఎఫ్ నిధులు సోమవారం స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కొంత కాలంగా ఆనారోగ్యంగా బాధపడుతున్న బాయమ్మ కుటుంబ సభ్యులు తనను కలసి వారి ఆర్థిక పరిస్థితి తెలపడంతో సిఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరుకు సిఫారస్సు చేయడమైనదన్నారు.

మంజూరైన నిధుల ఎల్‌ఒసిని కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. ఎందరో పేద కుటుంబీకులకు అందుతున్న సిఎంఆర్‌ఎఫ్ నిధులతో సంతోషంగా ఉన్నారన్నారు. సిఎం కేసీఆర్‌ను ఇంటి పెద్ద దిక్కుగా తలచుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, నాయకులు రాజు, వెంకటేశ్ గౌడ్, వంగరి అశోక్,భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News