Saturday, June 3, 2023

జీవన్ రెడ్డికి కొప్పుల ఈశ్వర్ సవాల్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. భూమిని చదును చేసేందుకు వెళ్తే ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన అంటారా? అని ప్రశ్నించారు. దొంగచాటున శంకుస్థాపన చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇథనాల ప్రాజెక్ట్ కోసం ఎవరి భూమీ తీసుకోవడంలేదని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయదన్నారు. బహిరంగా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, జీవన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని సవాలు విసిరారు. జీవన్ రెడ్డి వల్ల ధర్మపురి ప్రజలకే నష్టం వచ్చిందని, తమకు కాదన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చేతనైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సవాలు విసిరారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ పరిశ్రమ ఎందుకో చెప్పాలన్నారు. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని జీవన్ అడిగారు. ధర్మపురి ప్రజల గోడు కొప్పుల ఈశ్వర్‌కు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. ఎల్లంపల్లి నీళ్లు కాలుష్యమైతే ఎవరిది బాధ్యత అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News