Saturday, April 20, 2024

సిటి స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జగిత్యాల టౌన్‌ః జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటి స్కాన్ సెంటర్‌ను జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సిటి స్కాన్ లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి స్కానింత్ చేయించుకోవడం వల్ల పేదలకు ఆర్థికం ఊరట కలిగించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో సిటి స్కాన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో సిటి స్కాన్ ఏర్పాటుతో పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుందని ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతసురేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిప్రవీణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్, బుగ్గారం జడ్‌పిటిసి బాదినేని రాజేందర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News