Saturday, April 27, 2024

షర్మల బిజెపి కోవర్టు

- Advertisement -
- Advertisement -

షర్మల బిజెపి కోవర్టు
సిఎం కెసిఆర్‌పై అసభ్యంగా మాట్లాడితే ప్రజలు సహిస్తారా
మంత్రులు, ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా సహించాం
ప్రధాని మోడీపై ఇలాగే మాట్లాడితే బిజెపి కార్యకర్తలు ఊరుకుంటారా ?
ఎపికి వెళ్లి ఉచిత విద్యుత్‌పై పోరాటం చేయాలి
షర్మిలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అటాక్
మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో: బిజెపి పార్టీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోవర్టులా మారి పని చేస్తందని, అంతగా అమె పని చేయాల్సి వస్తే బిజెపిలో చేరాలని రాష్ట్ర అబ్కారి,క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. బిజెపికి మద్దతు ఇచ్చేందుకే ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తోందని ఆరోపించారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలం ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలా బరి తెగించి మాట్లాడరని అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల అనంతరం అమె ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విమర్శించారు. ఇదంతా బిజెపి ఆడిస్తున్న కుట్రలో బాగంగానే షర్మిల పాదయాత్ర చేపట్టిందని ఎద్దేవ చేశారు. తెలంగాణకు ఏ మాత్రం సంబందం లేకుండా పాదయాత్రలు చేస్తే మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా విమర్శిస్తూ మాట్లాడినా మహిళ అనేక గౌరవంతో పట్టించుకోలేదని, కాని, సిఎం కెఇసిఆర్‌పై అసభ్యంగా మాట్లాడితే ప్రజలు సహిస్తారా అని మంత్రి ప్రశ్నించారు.

షర్మిలను అరెస్టు చేసిన విధానంపై బిజెపి చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ప్రధాని మోడిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడితే బిజెపి కార్యకర్తలు సహిస్తారా అని ప్రశించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన షర్మిల అక్కడ బిజెపి నేతలతో భేటీ అయ్యిందని వార్తలు వచ్చాయని మంత్రి అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎపికి దేవుడు కావచ్చుకాని తెలంగాణకు మాత్రం నష్టం చేశాడన్నారు. మంచి చేస్తే మంచిగా చేశారన్నమే తప్పతే ఇతరత్రా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి తెలంగాణాకు ద్రోహం తలపెట్టి నీళ్లు తరలించుకు పోయిన విషయానిపై నిలదీశాము తప్పితే ఏనాడు విమర్శలు చేయలేదన్నారు. వైఎస్‌ఆర్ విగ్రహాలను కూడా ఇక్కడ ఎవరూ ద్వంసం చేయలేదన్నారు. తెలంగాణాలో ఎపికి చెందిన నేతల విగ్రహాలు ఉన్నాయని, ఎపిలో తెలంగాణకు చెందిన వైతాళికుల నాయకుల విగ్రహాలు ఎక్కడైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు.

తెలంగాణాకు ఏ మాత్రం సంబందం లేని షర్మిల ఇక్కడ పాదయాత్రల పేరిట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఘాటుగా విమర్శించారు. మహిళలు వాడరాని బాషను మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిని పట్టుకిని గజదొంగ, దొంగ అంటూ పదజాలం షర్మిల వాడడం మానుకోవాలన్నారు. ఆమె కుటుంబానికి 2004లో బంజారా హిల్స్ లో ఉన్న ఒకానొక ఇంటిని ఎన్నికల కోసం అమ్ముకుంటే ఇప్పడు వారికి లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీశారు. ఆమె తండ్రి అదికారంలో ఉన్న సమయంలో ఉన్న పథకాలను మేము తీసి వేయలేదన్నారు.

మా సిఎం కెసిఆర్ రైతుల కోసం 24 గంటలు ఉచిత విద్యుత్, రైతు బందు, రైతు భీమా వంటి పథకాలతో ప్రజలను మన్నలను పొందారన్నారు. షర్మిలకు ప్రజలపై అంత ప్రేమ ఉంటే ఎపికి వెళ్లి అక్కడ ఉచిత విద్యుత్ కోసం పాదయాత్రలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకొని స్దానికులను రెచ్చగొట్టి దెబ్బలు తిని సానుబూతి పొందాలని చూస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి వెంట ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్‌పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud slams YS Sharmila

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News