Friday, April 26, 2024

ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్?

- Advertisement -
- Advertisement -

Kriti Sanon is act opposite Prabhas

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ‘ఆదిపురుష్ 3డి’పై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారన్న కథనాలొచ్చాయి. ఇంతకీ సీత ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సరైన సమాధానం లేదు. సీత పాత్రకు పలువురు నాయికల పేర్లను పరిశీలించిన ఓంరౌత్ తాజాగా కృతి సనన్‌ని ఫైనల్ చేశారని కథనాలొస్తున్నాయి.

కృతి తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు మహేష్ సరసన ‘1నేనొక్కడినే’.. నాగచైతన్య సరసన ‘దోచేయ్’ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు క్రేజీగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ దక్కించుకుంటోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే కృతి ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ మీడియా కథనాల్లో కృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ పస్తుతం బాలీవుడ్‌లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ‘ఆదిపురుష్ 3డి’ని అత్యంత భారీ బడ్జెట్ తో టీ సిరీస్ నిర్మించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News