Sunday, April 28, 2024

పాతబస్తీకి కచ్చితంగా మెట్రో

- Advertisement -
- Advertisement -

KTR announced that metro train would definitely come to Old city

కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్‌ఎనా, కార్వాన్ ఎంఎల్‌ఎనా అన్నది మేము పట్టించుకోం
n ఏ పార్టీ ఎంఎల్‌ఎ అయినా ప్రతి నియోజక వర్గంలో అభివృద్ధి జరిగేలా చూస్తాం
n ఎవరిపైనా వివక్ష చూపించం n పాతబస్తీకి 14 వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించాం
n కాంగ్రెస్ కన్నా నాలుగు రెట్ల నిధులిచ్చాం n అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : పాతబస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుందని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. కరోనా వల్ల మెట్రో రైలు కొంత ఆలస్యమైందని ఆయన వివరించారు. పాతబస్తీకీ మెట్రో విస్తరించడం సరైన నిర్ణయమమన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీకి మెట్రోరైలు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశా రు. ఈ మెట్రోకు సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని సిఎం కెసిఆర్ వేశారన్నారు. ఎంఎంటిఎస్ రెండో దశ పనుల కోసం నిధులిస్తామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. సోమవారం శాసనసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో మసీ దు, గుడి, చర్చి నిర్మిస్తామన్నారు. 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరుగుతుందన్నారు. పనిచేశాం కాబట్టి మాట్లాడడానికి తమకు హక్కు ఉందన్నారు. పాతబస్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్లలో 14 వేల కోట్ల పైచిలుకు నిధులను విడుదల చేసిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం రూ.3 వేల కోట్లు మాత్ర మే విడుదల చేసిందన్నారు. పాతబస్తీలో రోడ్డు వైడ్డింగ్ పను లు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం రూ.400 కోట్లను కేటాయించామన్నారు.

పదేళ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది రూ.3,934 కోట్లే

పాతబస్తీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఖర్చు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పాతబస్తీకి ఏడేళ్లలో పురపాలక, ఇతర శాఖల ద్వారా రూ.14,887 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 2004- నుంచి 14 మధ్య కాంగ్రె స్ రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు మరో రూ. వంద కోట్లైనా ఇస్తామని ఆయన ప్రకటించారు. సెవెన్ టూంబ్స్, గోల్కొం డకు ప్రపంచ వారసత్వ హోదా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. మీరాలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తామని, రూ.10 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. మీరాలట్యాంకును సుందరీకరించడానికి రూ.40 కోట్లను మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ రోడ్డును బెంగళూరు హైవేకు కలిపేలా చర్యలు చేపడతామన్నారు.

తమ పార్టీ అభ్యర్థి ఓడినా ములుగును జిల్లా కేంద్రంగా…

గత అసెంబ్లీ ఎన్నికల్లో ములుగును జిల్లా కేంద్రంగా చేస్తామని అక్కడి ప్రజలకు సిఎం కెసిఆర్ హామీనిచ్చారని దురదృష్టశాత్తు అక్కడ తమ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను గెలిపించారని, అయినా ఇచ్చిన మాట కోసం సిఎం కెసిఆర్ మలుగు జిల్లా కేంద్రంగా చేశారని ఆయన తెలిపారు. మాకు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కటేనని ఎవరిపైనా వివక్ష చూపమన్నారు.

పాతబస్తీయే అసలు హైదరాబాద్

పాతబస్తీయే అసలు హైదరాబాద్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. చార్మినార్, మక్కామసీదు, హైకోర్టు తదితర వాటితో పురాతన కట్టడాలు అక్కడ ఉన్నాయి. 7 వివిధ ప్రాజెక్టుల కోసం రూ.1,500 కోట్లను వెచ్చించామన్నా రు. ఇందులో భాగంగా ప్లైఓవర్‌లు, అండర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఎస్‌ఆర్‌డిపి మొదటి ఫేజ్1 ఆర్‌ఓబిలను నిర్మిస్తున్నామన్నారు. కాంప్రీయెన్స్ కింద 729 కిలోమీటర్ల రహదారులను సిఆర్‌ఎంపి కింద అభివద్ధి చేశామన్నారు. ఇప్పటికే దీనికోసం రూ.118 కోట్ల ను ఖర్చు చేశామన్నారు. మూసీకి దక్షిణ, ఉత్తరం వైపు కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతుందన్నారు.

చార్మినార్ అభివృద్ధికి రూ.33 కోట్లు

బలాల నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్ ను అభివృద్ధి చేయడానికి అమృత్‌సర్ ఒక బృందాన్ని పంపించామన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి పర్యాటకుడు చార్మినార్‌కు వస్తారని అందులో భాగంగా దాని అభివృద్ధికి 2014 నుంచి ఇప్పటివరకు రూ.33 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇంకా రూ.100 కోట్లను చార్మినార్ అభివృద్ధికి కేటాయిస్తామని మంత్రి కెటిఆర్ హామినిచ్చా రు. కేవలం మాటలకే పరిమితం కాకుండా టూరిస్ట్ ప్లేస్ ల కోసం స్పెషల్ శానిటేషన్ కింద 24 గంటలు ఇక్కడ నిరంతరాయంగా కార్మికులు పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు. జిహెచ్‌ఎంసి నిధుల కింద పాతబస్తీలోని టూరిస్ట్ ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ. 600 కోట్లను కేటాయించామన్నారు. అభివృద్ధిలో పాత, కొత్త నగరాలన్న తేడా తమకు లేదన్నారు. రాజాసింగ్ చెబుతున్నట్లు ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపడం లేదని, కారు ఎమ్మెల్యేనా, కార్వాన్ ఎమ్మెల్యేనా అన్నది తాము ఆలోచించమని అభివృద్ధే తమ లక్షమన్నారు.

టూరిజం స్పాట్‌గా మోజంజాహీ మార్కెట్

కులీకుతుబ్ షా అర్భన్ డెవలప్‌మెంట్ కు 2,3 సంవత్సరాలుగా పనికల్పించ లేదన్నారు. త్వరలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నా రు. దీంతోపాటు పురాతన కట్టడాల గురించి రక్షణ చర్య లు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తన చిన్నతనంలో మోజంజాహీ మార్కెట్ దగ్గర కొన్ని రోజులు నివాసం ఉన్నానని, తాను మంత్రిని అయ్యాక ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో రూ.17 కోట్ల కేటాయించి ఆ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా మార్చామన్నారు. పాతబస్తీలో ఆలయాల విస్తరణకు సంబంధించి చర్యలు చేపట్టామన్నారు. కొన్నిచోట్ల విస్తరణ పనులు చేపట్టడానికి బాధితులకు ఇచ్చే పరిహారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు. లాడ్‌బజార్ రీ డెవలప్‌మెంట్ గురించి చర్యలు చేపట్టామన్నారు. పాతబస్తీలో 716 స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉండ గా మరిన్ని ఆటోలను అందుబాటులోకి తీసుకొస్తామన్నా రు. ఐటి పార్కు తో పాటు స్టేడియాలను కూడా నిర్మిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎల్‌బి స్టేడియంలో గతంలో ఉన్న షాపులను మాత్రమే లీజుకు ఇచ్చామని కొత్త వాటిని ఇవ్వలేదని మంత్రి కెటిఆర్ తెలిపారు.

జిహెచ్‌ఎంసి నుంచి రూ.9,899 కోట్లు

7 సంవత్సరాల కాలంలో పాతబస్తీ అభివృద్ధికి జిహెచ్‌ఎంసి రూ.9,899 కోట్లు, సివరేజీ అండ్ మెట్రో వాటర్‌వర్స్ ద్వారా రూ.3,794 కోట్లు, ఎంఐయూడి శాఖ ద్వారా రూ.13,693 కోట్లు, టూరిజం ద్వారా రూ.111, విద్యుత్ శాఖ తరఫున రూ.372 కోట్లను, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రూ.563 కోట్లు, మెడికల్ అండ్ హెల్త్ నుంచి రూ.60 కోట్లు, ఆర్ అండ్ బి నుంచి రూ.63 కోట్లు కేటాయించామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

1,60,840 మందికి కెసిఆర్ కిట్ల పంపిణీ

ఓల్డ్‌సిటీలో ప్రాజెక్టుల నిమిత్తం భూ సేకరణ చేయడానికి ఇప్పటివరకు రూ.327.65 కోట్లను ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కూడా రూ.166 కోట్ల ను ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 2014 నుంచి 40 రోడ్లను విస్తరించాలని నిర్ణయించామని, దీనికోసం రూ.250 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇప్పటికే 21 రోడ్ల విస్తరణ పూర్తయిందన్నారు. 200 ట్రాఫిక్ జంక్షన్‌ల లో 44 నూతన సిగ్నల్స్‌ను తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. పాతబస్తీలో అన్నపూర్ణ సెంటర్‌లను అధికంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 2 కోట్ల మందికి భోజ నం పెట్టామన్నారు. నైట్‌షెల్టర్‌ల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొత్తగా ఉస్మానియా ఆస్పత్రి కోసం మంచి బిల్డింగ్ కడతామని మంత్రి తెలిపారు.

హాకర్స్‌ను కచ్చితంగా షిప్ట్ చేస్తాం

1908 తరువాత హైదరాబాద్‌లో గత సంవత్సరం అక్టోబర్‌లో భారీగా వరదనీరు వచ్చిందన్నారు. ఆ సమయంలో మూసారంబాగ్ బ్రిడ్జి మునిగిపోయిందని, అందులో భాగంగా మూసీనదిపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. మూసీనది మీద 14 కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయించామని, అక్కడ నివాసం ఉంటున్న హాకర్స్‌ను ఆలస్యం అయినా కచ్చితంగా షిప్ట్ చేస్తామని ఆయ న హామినిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News