Wednesday, April 30, 2025

కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే విచారణ చేపట్టాలి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే విచారణ చేపట్టాలని ప్రధాని మోడీకి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత విషయంలో మోడీ ఆవేదన కేవలం మాటలకే పరిమితం కాకుండా భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలిలో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10 వేలకోట్ల ఆర్థిక మోసం అని పేర్కొన్నారు.

ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ ఆర్‌బిఎ, సెబి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశామని తెలిపారు. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించిందని గుర్తు చేశారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అని, అయితే నిస్సిగ్గుగా, అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలిలో చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాల పైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ ఒక్కటిగా కాదని… కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News