Thursday, April 25, 2024

తెలంగాణ మీకు శత్రుదేశమా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో 35 పనులలో 11 పూర్తి చేశామని, హైదరాబాద్‌లో 985.45 కోట్లతో నాలాల అభివృద్ధి చేపట్టామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో వందేళ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని, నాలాలపై 28 వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారని, ఎస్‌ఎన్‌డిపి దేశంలో ఏ నగరంలోనూ లేదని, ఎస్‌ఎన్‌డిపి ఫేజ్-2కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

రు.8250 కోట్లతో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తి చేస్తామని కెటిఆర్ చెప్పారు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడంలేదని కెటిఆర్ దుయ్యబట్టారు. ప్రతిపాదనలు పంపినా కేంద్రం స్పందించడం లేదని మండపడ్డారు. మిగిలిన పట్టణాల్లో మాత్రం మెట్రోకు నిధులు ఇస్తోందని, వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని, వాళ్ల రాష్ట్రాల్లోని మెట్రోలకే కేంద్రం నిధులు ఇస్తోందని, శత్రు దేశంపై పగబట్టినట్లు మోడీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News