Monday, October 14, 2024

సూరత్‌లో 3.8 తీవ్రతతో భూప్రకంపం!

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున 3.8 తీవ్రత(మాగ్నిట్యూడ్) భూకంపం సంభవించిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారి తెలిపారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి(డబ్లుఎస్‌డబ్లు)కి 27 కిమీ. దూరంలో భూకంప కేంద్రం అర్ధరాత్రి 12.52 గంటలకు నమోదయిందని ఆయన తెలిపారు. ‘ఇది 5.2 కిమీ. లోతుగా నమోదయింది. కాగా భూకంప కేంద్రం జిల్లాలోని హజీరాలో..అరేబియా సముద్రంలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు’ అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

గుజరాత్ రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ (జిఎస్‌డిఎంఎ) ప్రకారం రాష్ట్రం భూకంప ప్రమాదాన్ని అధికంగా ఎదుర్కొంటోంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956,2001లో పెద్ద భూకంప సంఘటనలు జరిగాయి. 2001లో వచ్చిన కచ్ భూకంపం గత రెండు శతాబ్దాలుగా భారత దేశంలో వచ్చిన అతిపెద్ద మూడో భూకంపం, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. దానివల్ల 13800కిపైగా మరణించగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News