Monday, April 29, 2024

వాహ్…రామన్న

- Advertisement -
- Advertisement -

నాటుకోడి కూర వండిన మంత్రి కెటిఆర్
చెఫ్ గా మారిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

గంగవ్వకు ఇచ్చిన మాట మేరకు సమయం కేటాయింపు

యూట్యూబ్ లో వీడియో వైరల్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ గంగవ్వతో కలిసి నాటు కోడి కూర వండారు. పొలాల గట్ల నడుమ.. పొయ్యి పెట్టి, టమాటలు, ఉల్లిగడ్డలు కోసి..భాగార అన్నంతో గంగవ్వతో కలిసి కెటిఆర్ జబర్ధస్త్ దావత్ చేసుకున్నారు. అటు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మై విలేజ్ షో, బిగ్ బాస్ ఫేం గంగవ్వకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కెటిఆర్ ఆమెతో కలిసి వంటచేసి దావత్ చేసుకునేందుకు సమయాన్ని వెచ్చించారు. కరీంనగర్‌లో గతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కెటిఆర్.. అదే వేదిక మీద ఉన్న గంగవ్వతో మాట్లాడారు. ఈ సమయంలోనే.. తన మై విలేజ్ షో ఛానల్‌కు సమయం ఇవ్వాలని కోరగా.. కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తానని ఆ సభా వేదికగా గంగవ్వకు కెటిఆర్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు.. కెటిఆర్ మై విలేజ్ షోకు వెళ్లారు. అక్కడ గంగవ్వతో పాటు అనిల్ జీలా, అంజి మామతో కలిసి కెటిఆర్ స్వయంగా నాటుకోడి కూర, గుడాలు, బాగార అన్నం వండారు.

ఇందుకు సంబంధించిన సుమారు 42 నిమిషాల పాటు ఉన్న వీడియోను కల్లి వెళ్లి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. అందులో కెటిఆర్‌తో గంగవ్వ ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అనుకుంటూనే.. గంగవ్వ కెటిఆర్ ప్రశ్నలు అడిగారు. కెసిఆర్‌తో ఎప్పుడైన గొడవలు అయ్యాయా అని అడగ్గా… గొడవలు జరగని ఇళ్లు ఉండదని.. తమకు కూడా జరిగాయని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్‌ను ఏమని పిలుస్తావ్ అని అడగ్గా.. బయట సార్ అని, ఇంట్లో మాత్రం డాడీ అని పిలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే.. వాళ్ల టీంతో పాటు కెటిఆర్ ముచ్చట్లు చెప్తూనే అందరి కంటే ముందే కోసేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తానే అన్ని పనులు చేసుకున్నానని.. . ఏ కూర బాగా వండుతారని అంజిమామ అడిగితే.. తాను అన్ని బాగానే వండుతా కానీ.. అది తినే వాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ నవ్వులు కెటిఆర్ పూయించారు. ఇలా.. తన కుటుంబం గురించి, వాళ్ల సంప్రదాయాల గురించి, అమ్మమ్మ నాయినమ్మల గురించి, పెళ్లి గురించి, చెల్లి కవితతో ఉన్న సంబంధం గురించి, ఈత నేర్చుకున్న విధానం గురించి, పిల్లల గురించి సరదాగా చెప్తూనే కెటిఆర్ నాటు కోడి కూర వండారు.

Gangavva 2

KTR dawat with Gangavva in the fields

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News