Saturday, April 27, 2024

యూట్యూబ్ చానెళ్లకు కేటీఆర్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బిఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని, గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.

‘గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్ నైల్స్ తో వార్తల పేరిట ప్రాపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం’ అని కేటీఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News