Thursday, May 2, 2024

కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కెటిఆర్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి నుంచి పార్లమెంటు ఎన్నికలకు పోటీచేస్తున్న కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ అధ్యక్షుడు కెటి. రామారావు మండిపడ్డారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి సీటు నుంచి పోటీచేస్తున్నారు. కాగా ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ‘తొలి భారత ప్రధాని’అని వ్యాఖ్యానించడంపై కెటిఆర్ మండిపడ్డారు. ఆయన ఎక్స్ పోస్ట్ లో ‘‘ఉత్తర భారత దేశం నుంచి ఓ బిజెపి అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అంటారు. దక్షిణాది నుంచి ఓ బిజెపి నాయకుడు మహాత్మా గాంధీ మన ప్రధాని అంటారు!! వీరంతా ఎక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వచ్చారు?’’ అని పేర్కొన్నారు. ఓ టెలివిజన్ ఇంటర్య్వూ లో కంగనా రనౌత్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అన్నారు.

కంగనా రనౌత్ ఇదివరలో కూడా మోడీ 2014లో  ప్రధాని అయ్యాకే భారత్ కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. కంగనా రనౌత్ ఇప్పుడు బిజెపి తరఫున లోక్ సభకు పోటీచేస్తున్నారు. ఆమె బిజెపికి గట్టి మద్దతుదారు. హిమాచల్ ప్రదేశ్ లో జూన్ 1న నాలుగు స్థానాలకు సింగిల్ ఫేస్ లో ఓటింగ్ జరుగనున్నది. ప్రస్తుతం నాలుగు లోక్ సభ సీట్లలో బిజెపికి మూడు, కాంగ్రెస్ ఒక సీటు ఉన్నాయి.

Kangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News