125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసన
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఉద్దేశపూర్వకంగానే
జగదీశ్‌పై సస్పెన్షన్ వేటు ఆయన ఒక్క పొల్లు మాట
మాట్లాడలేదు : కెటిఆర్ చరిత్రలో ఇది చీకటి రోజు :హరీశ్
సస్పెన్షన్ సర్కార్ కుట్ర : జగదీశ్ బిఆర్‌ఎస్ నేతలను తెలంగాణ
భవన్‌కు తరలించిన పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారా వు విమర్శించారు. అనని మాటల్ని అన్నట్టుగా చెప్పి అబద్దా ల ఆధారంగానే ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డిని కాంగ్రెస్ ప్ర భు త్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశా ల్లో బిఆర్‌ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమిషన్లు, ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు చర్చకి వస్తాయనే భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తరువాత బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో కలిసి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్త చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు జరుపుతామని వెల్లడించారు. ఉభయ సభల్లో గవర్నర్ చేసిన ప్రసంగంలోని అసత్యాలు, అర్థసత్యాలను ఎత్తిచూపుతున్న జగదీష్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు.
అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ శాసనసభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ ప్రసంగానికి అంతరాయం కలిగించినా కూడా ఆయన ఏమాత్రం సంయమనం కోల్పోలేదని చెప్పారు. ఎండిపోతున్న పంటలు, అధోగతిపాలైన వ్యవసాయం,రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ,పడని రైతుబంధు, అమలుగాని ఆరు గ్యారెంటీలు, 420 హామీల వాగ్దాన భంగం మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిందన్నారు. ఆయన ఎక్కడా అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదని స్పష్టం చేశారు. ఒక తండ్రిగా ప్రతిపక్ష నాయకుల హక్కులు కాపాడాలని ఆక్రోశం వ్యక్తం చేశారే కాని ఎక్కడా స్పీకర్‌ను అగౌరవపరచలేదని వ్యాఖ్యానించారు. వాస్తవం ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన నియంతృత్వ పోకడలతో ఐదు గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ఈ చర్య తీసుకున్నారని కెటిఆర్ మండిపడ్డారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయమన్న కెసిఆర్ ఆదేశాలతో స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి మూడ్ ఆఫ్ ది హౌజ్ తెలుసుకోవాలని తాము చేసిన సూచనను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. జగదీష్ రెడ్డిని కనీసం వివరణ కూడా అడగకుండా, ఏం తప్పు చేశారో చెప్పకుండానే సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దురంహకారానికి నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కెటిఆర్ పిలుపు
కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని సంకెళ్లతో బంధించిన నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కెటిఆర్ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమిషన్లు, ఢిల్లీకి పంపే మూటల విషయాలు చర్చకి వస్తాయన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపడం మీద తప్ప పేదలకు మంచి చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం శ్రద్ద లేదన్న సంగతి ప్రజలకు కూడా అర్థమైందన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఒక గొంతు నొక్కినంత మాత్రాన ఏదో సాధించామని భ్రమ పడతున్న కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార నియంత్రత పోకడలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కెటిఆర్ పిలుపునిచ్చారు.
శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ఆపలేరు : జగదీష్‌రెడ్డి
శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల ప్రసంగాలను ప్రసారం చేయట్లేదని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిజాలు దాయాలనుకోవడం సాధ్యం కాదని చెప్పారు. శాసనసభలో తాను అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయలేదని, శాసనసభ హుందాతనం తగ్గించేలా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. స్పీకర్ అధికారులు, విధులేంటో తనకు తెలుసు అని స్పష్టం చేశారు. స్పీకర్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని తెలిపారు. తాను స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడలేదని, ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడానని వివరించారు. తన సస్పెన్షన్ అనేది భయపెట్టే అంశం కాదని, ఇవేమీ తమని ఆపలేవని చెప్పారు. మరింత బలంగా గొంతు వినిపిస్తామని, శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ఆపలేరని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసింది -: మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు అని, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్‌తో గొంతు నొక్కడం అని పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పార్టీ పేరు పెట్టింది కెసిఆర్ అని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 10 లక్షల దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది కెసిఆర్ అని చెప్పారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, బాబు జగ్జీవన్ రావును కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే వారు కొత్త పార్టీ పెట్టుకున్న విషయం కూడా అందరికి తెలుసు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ ద్రౌపది ముర్మూని అవమానించారని అన్నారు. స్పీకర్‌కు, మంత్రి శ్రీధర్ బాబుకు బిఆర్‌ఎస్ పక్షాన శాసనసభ్యులం వెళ్లి వివరణ ఇచ్చామని తెలిపారు. ఉరి తీసేటప్పుడు కూడా మీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారని, సస్పెండ్ చేసిన సభ్యుని వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. కౌల్ అండ్ శక్దర్ పుస్తకంలో ఎక్కడ కూడా (యు) నీ అనే పదాన్ని నిషేధించలేదని, అయినా తాము ఎక్కడ స్పీకర్‌ను ఏకవచంతో సంబోధించలేదని చెప్పారు.రాహుల్ గాంధీ చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా.. ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుందని విమర్శించారు.
బిఆర్‌ఎస్ సభ్యులను తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు
అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బిఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. వీ వాంట్ జస్టిస్, వద్దురా నాయానా కాంగ్రెస్ పాలన అంటూ పోలీసు వ్యాన్‌లో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.