Tuesday, March 18, 2025

కేంద్రం కుట్రలను తిప్పికొడతాం

- Advertisement -
- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజన కాదు..దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కుదించే ప్రయత్నం
ఢిల్లీలో సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజం డీలిమిటేషన్‌పై చెన్నైలో జరగనున్న జెఎసి భేటీకి
రావాలని రేవంత్‌కు తమిళనాడు సిఎం స్టాలిన్ ఆహ్వానం రేవంత్‌ను కలిసి ఆహ్వానాన్ని
అందించిన డిఎంకె ప్రతినిధుల బృందం అధిష్ఠానం అనుమతితో వెళ్తా : రేవంత్

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణాది రా ష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవాలని కాంగ్రె స్ పార్టీ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని తాను చెన్నై సమావేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. డీలిమిటేషన్‌తో సౌత్ స్టేట్స్ కు తీవ్ర నష్టం జరుగనుందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో గురువారం తమిళనా డు మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీలు కనిమొ ళి, ఏ. రాజా, ఎన్.ఆర్ ఇళంగో, కళానిధి వీరాస్వామి, అరుణ్‌నెహ్రూ, డీఎంకే నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, త్రిభాషా అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహించ తలపెట్టిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి జేఏసీ సమావేశానికి ఆహ్వానం అం దిందని,పార్టీ అనుమతితో ఈ మీటింగ్ కు హాజ రు కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కు ట్రను తిప్పికొట్టడం, 2029 ఎన్నికల వరకు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించి ఏవిధంగా వ్యవహరించాలనే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలకపాత్ర పోషిస్తున్నారని, ఆయనను ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ రాష్ట్రంలోనూ చర్చలు జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపా రు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి , మాజీ మంత్రి జానారెడ్డికి సూచించినట్లు వెల్లడించారు.

కిషన్ రెడ్డి స్పందించాలి
చెన్నై మీటింగ్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వ పరంగా కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. బీజేపీ పార్టీ నేతలను కూడా అఖిలపక్షానికి ఆహ్వానిస్తామన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీకి చెందిన సమస్య కాదని మొత్తం దక్షిణ భారతదేశానికి నష్టం జరగబోయే అంశమఅన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందువల్ల తెలంగాణతో సహా దక్షిణ భారతదేశానికి నష్టం కలిగించే డీలిమిటేషన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలన్నారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ విషయంలో స్టాలిన్ ను ప్రోత్సహిస్తామన్నారు. దక్షిణ భారత దేశం దేశ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నదని కేవలం బీజేపీని దక్షిణ భారతదేశంలోకి ప్రజలు రానివ్వడం లేదనే కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News