గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ‘భారత్ సమ్మిట్’ కోసమే
జైశంకర్‌ను కలిశా కిషన్‌రెడ్డి తెలంగాణ అంశాలను పట్టించుకోవడం లేదు
మిస్ వరల్డ్ పోటీలకు రెండు రోజుల్లో కమిటీలు ఢిల్లీలో చిట్‌చాట్‌లో సిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : గాంధీ కుటుంబంతో తన కు మంచి అనుబంధముందని, ఫొటోలు దిగి చూపించుకో వాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ట్రా ప్‌లోనూ తాను పడనన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు గురువారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి మీడి యాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష నే త కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని, అసెంబ్లీ లో చర్చకు హాజరుకావాలన్నారు. డీలిమిటేషన్.. లిమిటేష న్ ఫర్ సౌత్ అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావా ల్సిన వాటిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేద న్నారు. ఆయా అంశాలు సాధించుకురావాలనే ఆయనను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
‘భారత్ సమ్మిట్’ కోసమే జైశంకర్‌ను కలిశా
తెలంగాణలో ‘భారత్ సమ్మిట్’ పేరిట ఓ కార్యక్రమం నిర్వ హిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 60 దేశాల నుం చి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్‌కు అమె రికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజర య్యే అవకాశముందని చెప్పారు. భారత్ సమ్మిట్‌కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ విషయంపై నే విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ‘మిస్ వరల్డ్ పోటీలు జరగను న్నాయని, నెలరోజుల పాటు దీనికి సంబంధించిన కార్యక్ర మాలు ఉంటాయన్నారు. దీనికోసం రెండు రోజుల్లో అధికా రులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ
అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌ను ఎమ్మె ల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ క్లా రిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని..అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నట్లు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.పార్టీ అనుబంధ విభాగా ల్లో పని చేసిన వారికి ఒకే సారి 37 కార్పొరేషన్ చైర్మన్ ప దవులు ఇచ్చానన్నారు. అలాగే అద్దంకి దయాకర్, విజయ శాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. డీసీ సీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు. కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడు కు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు. కేం ద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రం అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మామునూరు ఎ యిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నా రు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే స రి పోతుందని, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉ న్నాయన్నారు. డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా మన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరి చెబుతామన్నా రు. పన్నులు వసూలులో దేశంలో మొదటి స్థానంలో తె లంగాణ ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనం దం పొందుతున్నారన్నారు. పంటలు ఎండిపోయినా, ప్రజ లు ప్రాణాలు పోతున్నా బీఆర్‌ఎస్ నేతలు డ్యా న్సులు వేస్తు న్నారంటూ సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.