Thursday, March 20, 2025

సీతారామతో 8లక్షల ఎకరాలకు సాగునీరు

- Advertisement -
- Advertisement -

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల
రుణమాఫీ చేశాం రూ.10 వేల
కోట్లతో రైతు భరోసా అందిస్తున్నాం
సీతారామ టన్నెల్ పనుల పరిశీలనలో
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన తెలంగాణ/సత్తుపల్లి: సీతారామ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 7 నుండి 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జ లాలు అందనున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట సమీపంలో నిర్మిస్తున్న సీతారామ కాలువ 10 నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ట న్నెల్ లోపలకు అధికారులను వెంట పెట్టుకుని తు మ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళడం ప లువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 25 లక్షల మందికి రూ.21 వేల కోట్లతో రూ.2 లక్షల మేర రుణమాఫీ చేశాం అన్నారు. అదేవిధంగా రూ.10 వేల కోట్లతో రైతు బంధు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.11 వందల కోట్ల బోనస్ కు గానూ ఇప్పటికే రూ.900 కోట్లు అందజేయగా మరో రూ.200 కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే సత్తుపల్లి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, అన్ని రంగాల్లోనూ ఇంత అభివృద్ధి చెందిన ప్రాం తం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, ఆ అభివృద్ధిలో పా లుపంచుకున్న తనకు ఈ అంశం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ప్రాజెక్టును న మ్ముకున్న ఏదో ఒక నాటికి ఎండిపోతున్నాయని, వీటి నుంచి శాశ్వత పరిష్కారం జీవనది గోదావరి ఒకటేనని భావించి, సీతారామ ప్రాజెక్టును రూపొందించామన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ప్రాజెక్టు వరప్రదాయని అని జిల్లా అంతట సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించినట్లు తుమ్మల చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్వతో ముఖాభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వెంగళరావు నుంచి తన వరకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ రహదారులు కూడా అన్ని మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని, జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు మరో రహదారికి ప్రతిపాదనలు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అంతా వ్యవసాయ రంగానికి ఉంటుందని రైతులంతా హార్టికల్చర్ సాగుపై దృష్టి సారించి ఆర్థిక సుస్థిరత సాధించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం తన స్వప్నమని జిల్లా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే ఈ ప్రాజెక్ట్ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్టుకు ప్రజలు భూసేకరణ సహకరించారని, వారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి గోదావరి జలాలు అందజేస్తామని పేర్కొన్నారు. లంకా సాగర్ ప్రాజెక్టు కూడా చెరువుల ద్వారా గోదావరి జలాలు అందుతాయన్నారు.

భూసేకరణ పరిహారం అందజేయడంలో కుటుంబ కలహాలు ఉన్నవారికి సాగులో ఉన్న రైతు ఖాతాలో పరిహారం జమ చేసి పనులు చేయాలన్నారు. భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అప్రమత్తంగా ఉంటూ భూ సేకరణ నష్టపరిహారం వ్యవహారం పూర్తి చేయాలని ప్రాజెక్ట్ పనులు ఎక్కడ ఆగడానికి వీలులేదని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తుమ్మల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చినప్పటికీ కొందరు తహసీల్దారులు హాజరు కాకపోవడం విచారకరమని ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. రెండు జిల్లాలకు చురుకైన కలెక్టర్లు ఉండడం జిల్లా ప్రజల అదృష్టమని వారి సహకారంతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజామిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి ఆర్ డి ఓ రాజేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయకుమార్ సహా పలువురు నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News