Thursday, March 20, 2025

సింబల్ వార్

- Advertisement -
- Advertisement -

హిందీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న తమిళనాడు ప్రభుత్వం హిందీ అక్షరం’ ర’ ను పోలి ఉండే రుపాయి సింబల్ ను మార్చింది. తమిళనాడు బడ్జెట్ పత్రాలలో చాలా కాలంగా వాడకంలో ఉన్న రూపాయి సింబల్ బదులు తమిళ అక్షరం ‘రూ’ ను ప్రచురించి సంచలనానికి తెరతీసింది. కేంద్రంతో మరో వివాదానికి తెరలేచింది. కొత్త విద్యావిధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం ద్వారా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం యత్నిస్తోందని పోరాటం సాగిస్తున్న తమిళనాడు కరెన్సీ సింబల్ ను కాదని, తమిళ అక్షరం ‘రూ’ ను వినియోగించాలని నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కొత్త రూపాయి సింబల్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు.

కేంద్రంతో తీవ్ర వివాదం నేపథ్యంలోతమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పత్రాలలో హిందీ అక్షరం ఆర్ అనే రూపాయి చిహ్నాన్ని మార్చారు.
ఈ అంశంపై డిఎంకె నాయకుడు శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ ఇందులో చట్టవిరుద్ధం ఏమీ లేదన్నారు. ఇది షౌడౌన్ కాదు.. బడ్జెట్ పత్రాలలో తమిళ అక్షరానికి ప్రాధాన్యం మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర శాఖ అధికారప్రతినిధి నారాయణన్ తిరుపతి స్పందిస్తూ, ప్రభుత్వం వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. బిజేపీ రాష్ట్ర శాఖ చీప్ కె అన్నామలై సీఎం చర్య తెలివితక్కువ పని అని విమర్శించారు. డిఎంకె ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని మరో సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర్యరాజన్ ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News