Friday, April 26, 2024

‘ప్రభావశీలి’ కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఐటి,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో కెటిఆర్ నిలిచారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే జాబితాలో మనదేశం నుంచి కెటిఆర్ ప్రథమస్థానం సంపాదించగా ఆప్ ఎం పి రాఘవ్ చద్దా రెండోస్థానంలో నిలిచారు. భారతదేశం నుంచి ఇద్దరు యువనేతలకు మాత్రమే ఈ జాబితాలో చోటుదక్కగా అందులో కెటిఆర్‌ఒకరు. ఇండియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన 30 మంది సోషల్ మీడియా ప్రభావితం చేసే జాబితాలో కెటిఆర్‌కు 12వ స్థానం, ఎంపి రాఘవ్ చద్దా 23వ స్థానం లో నిలిచారు.

అటు అఫిషీయల్, ఇటు పర్సనల్ అ కౌంట్‌లోనూ ఆయనదే హవా. రెండు ఖాతాల్లో నూ మంత్రి కెటిఆర్ అగ్రస్థానంలో ని లిచారు. అటు అఫిషీయల్, ఇటు పర్సనల్ అకౌంట్ రెండింటిలోనూ మంత్రి కెటిఆర్ ముందంజలో నిలిచారు. ఐటీ శాఖ మంత్రిగా దాని పురోభివృద్ధికి కృషి చేస్తున్న కెటిఆర్ సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికారిక, ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ ఆయన అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణ ఐటి శాఖకు చెందిన అఫిషీయల్ ట్విట్టర్ అకౌంట్ 22వ స్థానాన్ని దక్కించుకుంది.

ఆస్క్ కెటిఆర్

మంత్రి కెటిఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ప్రజల సమస్యలు, రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడూ స్పందిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ‘ఆస్క్ కెటిఆర్’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కెటిఆర్ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలో నిలిచేలా చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం

ఐటి శాఖ మంత్రిగా దాని పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కెటిఆర్ సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటారు. మరోవైపు సమస్యల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. టాప్ సోషల్ మీడియాను ప్రభావితం చేసే లిస్టులో మంత్రి కెటిఆర్‌కు చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News