Wednesday, April 24, 2024

సాగర్ ఉపఎన్నిక హామీలన్నింటిని నెరవేర్చాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీలను అన్నింటిని నెరవేర్చారని మంత్రి కెటిఆర్ చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా హాలియలో పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ” అడగకున్న పేదల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ, షాదిముభరక్ పథకం ద్వారా అడబిడ్డల పెళ్లికి ఆర్ధిక సాయం చేస్తున్నరు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు సన్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వంది. 70 ఏళ్ల భారత దేశ చరిత్రలో రైతుల బాగు కోసం ఏనాడు ఏ ఒక్క నాయకుడికి ఆలోచన రాలేదు. రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి. సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీలను అన్నింటిని నెరవేర్చారు. సాగర్ నియోజకవర్గంలో ఇంకా చాలా పని చేస్తాం. గిరిజనుల కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఒక్క సాగర్ నియోజకవర్గంలోనే 40 తాండలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది. రాహుల్ గాంధీ ఇక్కడికొచ్చి, రైతులను ఎదో ఉద్దరిస్తా.. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్నాడు. పది సార్లు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఎం చేయాలే… కానీ ఇప్పుడు మాత్రం గొప్పలకు పోతున్నాడు. రైతులను అయోమయం చేస్తున్నాడు.. రాహుల్ గాంధీకి ఏడ్లు అంటే తెల్వదు.. వ్యవసాయం అంటే ఎంటో తెలియదు..కాంగ్రెస్ వాళ్లు వాళ్లకు వాళ్లే తన్నుకునే సభ అది. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ వాళ్ళు తన్నుకునే సభలా నిలిచింది వరంగల్ సభ” అని ఎద్దేవా చేశారు.

KTR Speech at TRS Public Meeting in Haliya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News