Thursday, May 2, 2024

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అసలు అటువంటి హామీ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చడం వాళ్లకే సంస్కారానికి వదిలేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చిందని,  వాస్తవానికి బిఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని చురకలంటించారు.

అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000 లకు (2 పేపర్లకు) పెంచిందని, ఎంఎల్ సి బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో కోర్టు కేసులు వేసి అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని విమర్శించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని, ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ వదిలేసిందన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని, తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News