Wednesday, April 30, 2025

రింకూ చెంపపై రెండు సార్లు కొట్టిన కుల్‌దీప్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో కెకెఆర్ గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం అనూహ్య ఘటన జరిగింది. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్‌పై ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చేయి చేసుకున్నాడు. తొలుత రింకూ చెంపపై కుల్‌దీప్ కొట్టాడు. మరొసారి మళ్లీ అలానే కొట్టడంతో అసహనానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడి ప్రవర్తన మంచిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల్‌దీప్‌పై చర్యలు తీసుకోవాలని బిసిసిఐని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News