Monday, August 4, 2025

కుమ్మర్లు రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: శాలివాహన (కుమ్మరి) సంఘం మోత్కూరు మండల అడ్ హాక్ కమిటీని ఆదివారంఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మరి సంఘం కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ శాలివాహన కుమ్మర్లు రాజకీయాల్లోకి రావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే గానీ , ఒక్క ఎంపీ గాని లేరని మన శాలివాహన కుమ్మర్లు ముందుకు రావాలని, చట్టసభల్లో మన వాణి వినిపించాలన్నారు. హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ కో కన్వీనర్ ఓరుగంటి గోపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా సభ్యులు తాడూరి ఆంజనేయులు , చిన్నగారి బలరాం, చిన్నగారి కృష్ణ, గుమ్మిడేల్లి భాస్కర్ సమక్షంలో మోత్కూర్ మండల అడ్ హాక్ కమిటీ ఎన్నుకున్నారు.

కమిటీ కన్వీనర్ గా మారుపాక బిక్షపతి , కో కన్వీనర్ గా నరుకుడు బిందెల శ్రీనివాస్ ల తో పాటు సభ్యులుగా నేర్లకంటి మచ్చగిరి, నిలిగొండ కృష్ణ, మారుపాక పవన్ కుమార్,చేతరాశి వీరస్వామి, చంద్రయ్య చంద్రయ్య, మారుపాక శేఖర్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట, ఆత్మకూరు మండలాల కన్వీనర్ లు బొడ్డుపల్లి సైదులు, కొత్తపల్లి గోవార్డెన్ ,నాయకులు చేతరాశి వీరస్వామి, నిలిగొండ అశోక్ ,నిలిగొండ కృష్ణ, చేతరాశి అంజయ్య, కృష్ణ, చేతరాశి చంద్రయ్య, నేర్లకంటి మచ్చ గిరి, మారుపాక వెంకటేష్, పోలేపల్లి అంజయ్య, నిలిగొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News