Sunday, September 15, 2024

14 ఏళ్ల బాలికపై ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులు

- Advertisement -
- Advertisement -

హవ్‌డాలో 14 ఏళ్ల బాలికపై ఆస్పత్రి లోని ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులకు పాల్పడ్డాడు. నిమోనియాతో బాధపడుతున్న ఆ బాలిక హవ్‌డా సర్దార్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ కోసం వెళ్లగా, ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అభ్యంతర కరంగా ప్రవర్తించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను రక్షించగలిగారు. దీనిపై బాధితురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిపై దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీస్‌లు అక్కడకు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వరుస సంఘటలతో తృణమూల్ కాంగ్రెస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News