Tuesday, January 31, 2023

జార్ఖండ్‌లో వ్యాను బోల్తా… ఏడుగురు కూలీలు దుర్మరణం

- Advertisement -

రాయ్‌పూర్ : జార్ఖండ్ లోని సెరైకెలాఖర్సావాస్ జిల్లాలో గురువారం ఉదయం కూలీలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడడంతో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపం లోని ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అతివేగంగా వెళ్తున్న వ్యాన్‌ను లక్డాకొచ్చా మలుపు వద్ద తిప్పేందుకు డ్రైవర్ యత్నించి విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సీఎం హేమంత్ సొరేన్ ఈ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యాన్‌లో దాదాపు 35 మంది కూలీలు ఉన్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. రాజ్‌నగర్‌లోని హంసాల్లో ఫౌండ్రీ పనిచేసేందుకు వీరంతా చైబాసా నుంచి బయలుదేరినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ పరారయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles