Monday, April 29, 2024

కోడ్ ఉల్లంఘన కేసులో లాలూకు ఊరట

- Advertisement -
- Advertisement -

Lalu Prasad Yadav has been acquitted in code violation case

 

రాంచీ : కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్ లోని పాలము కోర్టుకు లాలూ హాజరవ్వగా, విచారణ తరువాత కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఆయనకు రూ.6 వేల జరిమానా కోర్టు విధించింది. ఈ కేసులో లాలూకు విముక్తి లభించిందని , ఇకపై ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది ధీరేంద్ర కుమార్ తెలిపారు. 2009 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలము జిల్లా గర్వా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆర్జేడీ తరఫున గిరినాధ్ సింగ్ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం లాలూప్రసాద్ యాదవ్ హెలికాప్టర్‌లో గర్వా చేరారు. ఇక్కడి గోవింద్ హైస్కూల్‌లో ఆయన ఎన్నికల సమావేశం జరగనుంది. హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి గర్వా బ్లాక్ లోని కల్యాణ్‌పూర్‌లో హెలీప్యాడ్‌ను నిర్మించారు. దీనికి అధికారులు అనుమతినివ్వగా, నిర్ణీత హెలీప్యాడ్‌లో దిగకుండా గోవింద్ హైస్కూల్ మైదానంలోని సభాస్థలంలో దింపారు. దీంతో సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు లాలూపై ఎనికల సంఘం కేసు నమోదు చేసింది.ఈ కేసులో లాలూ ఇప్పటికే నెలన్నర జైలు జీవితం గడిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News