Tuesday, October 15, 2024

బాధితుడికి 60 ఏండ్లకు దక్కిన భూ న్యాయం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రకు చెందిన ఈ భూ పంచాయితీ షష్టిపూర్తికి చేరుకుంది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తికి చెందిన 24 ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా లాక్కుంది. ఈ ఉదంతంపై విచారణల క్రమంలో సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. భూమిని ప్రభుత్వం లాక్కుందని నిర్థారించుకుంది. దీనిని చక్కదిద్దేందుకు సదరు బాధితుడు, తమ ముందుకు వచ్చిన ఫిర్యాదీకి ఇంత మేరకు 24 ఎకరాల, 38 గుంటల మేర ఎటువంటి బాదరబందీ , చిక్కులు లేని భూమిని కేటాయించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పువెలువరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. 60 ఏండ్ల క్రితం ఈ భూమిని లాక్కున్నందున, సదరు ఆసామీకి అన్యాయం జరిగినందున ప్రభుత్వం వెంటనే ఇంతే విస్తీర్ణపు జాగాను కట్టబెట్టాల్సి ఉందని తీర్పులో తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్‌కుమార్‌కు చివాట్లు పెట్టింది.

బాధితుడికి తగు మూల్యం చెల్లిస్తామని సంబంధిత పుణే జిల్లా కలెక్టరు ద్వారా , ఈ భూమికి విలువను కేవలం రూ 48 కోట్ల చిల్లరగా లెక్కకట్టడాన్ని తప్పుపట్టింది. అయితే తనకు చెందిన ఈ భూమి విలువ ప్రస్తుత రేటు రూ 250 కోట్లకు పైగా పలుకుతుంది. తనకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం అవసరం లేదని , ఇంతే విస్తీర్ణపు భూమి లేదా, ప్రస్తుత మార్కెట్ విలువ కట్టి డబ్బులు ఇవ్వాలనే విషయాన్ని బాధితుడు తెలియచేసుకున్నారు. దీనితో ఏకీభవించి ఈ మేరకు ఇంతే భూమిని వేరే చోట ఆయనకు అప్పగించాలని ధర్మాసనం తెలిపింది. పైగా అటవీ శాఖ ఈ భూమిని తీసుకున్నందున, పైగా తక్కువ విలువ కట్టి ఇస్తామని చెప్పినందున సంబంధిత అటవీశాఖాధికారికి చురకలు పెట్టారు. జగడాలు లేని , పడావు భూమిని ఆశ్రితుడికి అప్పగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ బాధితుడి భూమిలో ఆక్రమణలు ఉంటే, వాటిని తొలిగించి సజావైన రీతిలో ఉండేలా చేసి, పట్టా పునరుద్ధరించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనంతెలిపింది.

దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం తప్పయిపోయిందని పేర్కొంటూ, వేరే భూమిని అప్పగించేందుకు సిద్ధం అని హామీ పత్రం దాఖలు చేసుకుంది. బాధితుడి భూమిని అటవీప్రాంతంలో కల్పినందున ఈ భూమి స్వాధీనపర్చరాదని, అటవీ పర్యావరణ భద్రతకు భంగం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ వ్యక్తికి అయినా చట్టరీత్యా ఉన్న భూమిని వ్యవసాయ పరిశోధనలు లేదా అటవీప్రాంతంలో కలిపేందుకు స్వాధీనపర్చుకోవడం చట్టరీత్యా చెల్లనేరదని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలిపిన తరువాత వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News