Sunday, February 5, 2023

ఉత్తరాఖండ్‌లో కుంచించుకుపోతున్న భూమి!?

- Advertisement -

జోషిమఠ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్‌లోని దేవ్ భూమిగా పేరుగాంచిన  జోషిమఠ్  పట్టణంలో ఉన్న 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అక్కడ భూమి కుంచించుకుపోతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి త్వరలో ఆ పట్టణాన్ని సందర్శించి వివరాలు వాకబుచేయనున్నారని తెలిసింది. వాతావరణం, కట్టడాలలో మార్పులు చోటుచేసుకోవడంతో దాదాపు 60 కుటుంబాలు ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్లిపోయాయి. 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. మరో 500 కుటుంబాలు ప్రాణాలను పణంగా పెట్టి బీటలు వారి ఇళ్లలోనే ఉంటున్నారు. కొంకర్లు పోయే చలిలలో మరో వసతి దొరుకుతుందా అని కూడా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు 3000కు పైగా జనులు ప్రభావితులయ్యారని మున్సిపాలిటీ చీఫ్ తెలిపారు. అది పట్టణ జనాభాలో 10 శాతం అని తెలిపారు. ‘మున్సిపాలిటీలోని అన్ని ఇళ్లను సర్వే చేశాము. చాలా మంది తమ గృహాలు వదిలేసి పోయారు’ అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి నివేదిక పంపడానికి ఐఐటి రూర్కీ బృందం పనిచేస్తోంది. ఇళ్లే కాదు రోడ్లు కూడా బీటలు బారాయి. ఈ సమస్య తొమ్మిది వార్డుల్లో ఉంది. జోషిమఠ్  ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉన్న హిమాలయ పట్టణం కూడా. జోషిమఠ్ ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి త్వరలో సందర్శించనున్నారు.

‘మేము పునరావాసం కల్పించాలని ఏడాదిపాటుగా డిమాండ్ చేస్తున్నాము’ అని సేవ్ జోషిమఠ్  కమిటీ కన్వీనర్ అతుల్ సాతి అన్నారు. జోషిమఠ్  పట్టణం పునాదులు కుంచించుకుపోతున్నాయి. ప్రజలు తమ ఇళ్లను వెదురు కర్రలు పాతి పడిపోకుండా నిలబెడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ పట్టణం చైనా సరిహద్దులోని మిలిటరీ స్టేషన్లకు దగ్గరగా ఉంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles