Thursday, June 20, 2024

పాలమూరు కల సాకారం

- Advertisement -
- Advertisement -

కృష్ణమ్మ కరుణించింది.. కెసిఆర్ మేధోమథనం ఫలించింది. పాలమూ రురంగారెడ్డి పేరుతో అద్భుత పథకం పు ట్టుకొచ్చింది. ఏకంగా కృష్ణానదినే మలుపు తప్పింది. బీడుబారిన పాలమూరు జిల్లాపై కి జలతరంగంమై ఉరికి వస్తోంది. మోడువారిన వ్యవసాయరంగానికి జీవం పోయబోతోంది. తెలంగాణ మెడలో జలహారంతో చుట్టుకుంటోంది. కోతిగుండు రూపంలో అంజన్న వరమిచ్చాడు. చూసేందుకు అది చిన్న అప్రోచ్ ఛానల్‌గా ప్రారంభమై వరదలా మారుతుంది. వందల మీటర్ల ఎత్తుకు కృష్ణానదీ ఎగిసిపడే అద్భుత దృశ్యం మరికొన్నిగంటల్లో కళ్లముందు ఆవిస్కృతం కానుంది. ప్రపంచనీటి పారుదల రంగం చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోనున్న ఈ మధుర ఘట్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు కర్త..కర్మ ..క్రియగా నిలిచిపోనున్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాత ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు జిల్లాను రెండుగా చీల్చుకుంటూ ప్రవహించే కృష్ణానదీ ఇక ఈ నేలను తడపకుండా .దశాబ్ధాల తరబడి చుక్కనీటికోసం పరితపిస్తున్న రైతుల కన్నీటిని తుడవకుండా..

పసిడి పంటలతో భూమాత నుదుటు అకుపచ్చ తిలకం దిద్దకుండా..వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ముందుకు సాగనంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో తొలిప్రాధాన్యం నెర్రెలిచ్చిన కరువునేలకే నంటోంది. ఇన్నాళ్ల పాలకుల నిర్లక్ష్యానికి తనను నిందించవద్దంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు వెనకజలాల్లో 160 టీఎంసీలు మీకేనంటోంది. గోదారమ్మతో పోటీ పడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి నదీజలాలు ఉత్తర తెలగాణ వ్యవసాయరంగానికి జీవం పోస్తే ..తానుమాత్రం తక్కవేంటని దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందకు సిద్దమవుతోంది.ఇంతటి మహత్తర ..ఉదాత్త కృష్ణమ్మకు దక్షిణ తెలంగాణ జనం జలహారతులు పట్టబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి పంపుల ద్వారా పాతాళం నుంచి 105 మీటర్లకు ఎగిసి వచ్చే కృష్ణానదీలజాలను కళశాలలో నింపుకోని ఊరూరా పండుగ చేసుకునేందుకు పాలమూరు జనం వెల్లువలా తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారు.
ఎత్తిపోతల రంగంలో కొత్తశకం
పాలమూరు రంగారెడ్డి పథకం ప్రారంభంతో ఎత్తిపోతల నీటిపారుదల రంగంలో కొత్తశకం ప్రారంభంకాబోతోంది. ఇప్పటిదాక గోదావరి నదీలజాల ఆధారంగా అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకమే ప్రపంచ అద్భుతంగా మారి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులను ఔరా.. అంటూ ముక్కున వేలేయించింది. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు కాళేశ్వరాన్ని మించిన రీతిలో నిర్మాణం దాల్చింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ఏకంగా 160టీఎంసీల కృష్ణానదీజలాలు ఒక్క ప్రాంతం నుంచే వందల మీటర్ల ఎత్తుకు ఉప్పొంగనున్నాయి. కృష్ణానదిలో కొతిగుండు ప్రాతం నుంచి 20.8 కిలోమీటరల అప్రోచ్ చానల్ ద్వారా కృష్ణానది ఉమ్మడి పాలమూరు జిల్లాకు మలుపు తిరగనుంది. నదీగర్భంలో చిన్నకాలువగా కనిపించే ఈ అప్రోచ్ కాలువ 781అడుగుల స్థాయిలో నిర్మించారు. 30మీటర్ల లోతు , 40మీటర్ల వెడల్పుతో ఈ అప్రోచ్ కాలువను ఆధునీకరించారు.

కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోతల పంప్‌హౌస్‌లకు అందించేంత సామర్దంతో నిర్మించారు.. ఈ కాలువ రెండుగా చీలి ఒకవైపు మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి , మరోవైపు పాలమూరురంగారెడ్డి పథకానికి కృష్ణానదీజలాలను అందించనుంది.కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే 25టిఎంసీల నీటికేటాయింపులు ఉన్నాయి. ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా కేసిఆర్ ప్రభుత్వం కల్వకుర్తి పథకాన్ని 25నుంచి 40టీఎంసీల నీటివినియోగపు సామర్ధానికి పెంచింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం ద్వారా 4.51లక్షల ఎకరాలతోపాటు ఏడు నియోజకవరాలోని 336 గ్రామాలకు తాగు సాగు నీరు అందనుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌కు పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం హెడ్‌రెగ్యూలేటర్ నిర్మించారు. అప్రోచ్ చానల్‌లోని ఒక పాయ హెడ్‌రెగ్యులేటర్‌కు వరద జలాలను తీసుకురానుంది. హైడ్‌రెగ్యులేటర్‌కు సమీపాన మూడు భారీ సొరంగ కాలువను నిర్మించారు .

ఈ సొరంగాల ద్వారా సర్జిపూల్‌కు చేరుకనే కృష్ణాజలాలను 105మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా కాళేశ్వరంను మించిన అత్యంత శక్తివంతమైన మెగా పంప్‌హౌస్‌ను నిర్మించారు.ఒక్కోటి 145మెగావాట్ల సామర్దంతో కూడిన తొమ్మిది పంపుల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఎగువన ఒక వైపు కల్వకుర్తి పథకానికి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్ ఉండగా ,దాని గట్టును ఆనుకునే పాలమూరు రంగారెడ్డి పథకం నీటిని నిల్వచేసే నార్లాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. రెండు రిజర్వాయర్లలోని నీరు ఒకదాని నుంచి మరో దానిలోకి ప్రవేశించేలా రెండింటికి మధ్యన ప్రత్యేక తూములు ఏర్పాటు చేశారు. పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా రోజుకు 1.5టిఎంసీల చొప్పున 60రోజుల్లో 90టిఎంసీల కృష్ణానదీలజలాలను ఎత్తిపోయనున్నారు. మరో వైపు ఇదే ప్రాంతం నుంచే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి డిండి ప్రాజెక్టుకు 30టిఎంసీల కృష్ణానదీజలాలను ఎత్తిపోయనున్నారు. తద్వారా 3.68లక్షల ఎకరాలకు సాగునీటిని అంచించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.
పనుల నాణ్యతలో రాజీపడని ప్రభుత్వం
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా లక్షం మేరకు పనులు చేయించింది. మెగా పంపుల నిర్మానం, సర్జిపూల్స్ నిర్మాణాలు , ఉపరితలంగా నిర్మించిన రిజర్వాయర్లు , గ్రావిటి కాలువలు తదితర పనుల నాణ్యతలో ప్రభుత్వం వివిధ పరీక్షల ద్వారా సంతృప్తి చెందాకే ఆమోదం తెలుపుతూ వచ్చింది. ఈ బృహత్త పధకం ద్వారా 12.30లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట్ ,రంగారెడ్డి, వికారాబాద్ ,నల్లగొండ జిల్లాల్లో వందలాది గ్రామాలకు తాగునీరు , పరిశ్రమల ఏర్పాటుకు నీరందనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News