Saturday, September 21, 2024

ఆర్‌జే శేఖర్‌ భాషాపై లావణ్య ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

ఆర్జే శేఖర్ భాషా తనపై దాడి చేశాడని సినీ హీరో రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో శేఖర్ భాషా తనపై ఆరోపణలు చేస్తుండగా ప్రశ్నించేందుకు వెళ్లగా తనపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ భాషా తనను చూడగానే కడుపుపై తన్నడంతోపాటు విచక్షణా రహితంగా కొట్టాడని ఆరోపించింది. రాజ్‌తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రాజ్‌తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని, పదేళ్లు తనతో కాపురం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని మెడికల్ రిపోర్ట్‌ను కూడా పోలీసులకు అందించింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. ఈ క్రమంలోనే రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News