Friday, September 20, 2024

సిపిఎస్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఇటీవల గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ సీపీఎస్ ఒకేషనల్ టీచర్ ఎద్దు ఉపేంద్రం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన 3 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆదివారం మిర్యాలగూడ ఎం వి.ఆర్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో టి.పి.సి.సి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజస్ధాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించినదో అదే మాదిరి తెలంగాణలో కూడా నూతన పెన్షన్ స్కీం ను రద్దు చేసి పాత పెన్షన్ ను తిరిగి ప్రవేశ పెడతామని స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలో సిపిఎస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ పునరుద్ధరణ శుభవార్త వింటారన్నారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు అశం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉందని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాత పెన్షన్ పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నూతన పెన్షన్ విధానం వల్ల రిటైర్మెంట్ అనంతరం వృద్దాప్యంలో పెన్షన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పాత పెన్షన్ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ నూతన పెన్షన్ పథకం అమలు చేసిన1 సెప్టెంబర్ 2004 నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఉద్యోగ , ఉపాధ్యాయలు మరణించడం జరిగిందని, ఉద్యోగుల పై ఆధారపడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడ్డారన్నారు. సీపీఎస్ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగ,ఉపాధ్యాయలకు ఆర్థిక ,ఆరోగ్య భద్రత లేకపోవడం వల్ల తీవ్రమైన వత్తిడి కి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 బాధితుల సమస్యలకు పరిష్కారం చూపి, దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న 30 వేల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి ఉద్యోగుల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 3 లక్షల ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఈడిగె నరేష్ గౌడ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్,ఉపాధ్యక్షులు సురెందర్ సింగ్ ఠాగూర్, జిల్లా అధ్యక్షులు శిరందాసు రామదాసు,విజయ్, బాలాజీ నాయక్, నర్సింహ నాయక్,లింగమూర్తి,దర్శణ్ గౌడ్, భూలక్ష్మి, వీరేశం,బుచ్చన్న,దిల్శాద్, ప్రవీణ్,యూసూఫ్, తదితరులు పాల్గొన్నారు. పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయించాలి : టిపిఆర్‌టియు వ్యవస్థాపకులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం కల్వకుర్తికి వచ్చిన సందర్భంగా డివిజన్ లోని ఉపాధ్యాయులు కలిశారు.5,000 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయించి అందులో బిఈడీ, డిఈడీ ఇద్దరికీ కామన్‌గా ప్రమోషన్ ఇవ్వాలని, 317 బాధితులు, సీపీఎస్ రద్దు చేయడం గురించి వినతిపత్రం అందించారు. ఎస్‌జీటీ వారికి బీపిఈడీ చేసిన అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. వివిధ మండలాల ఉపాధ్యాయులు ఆయనను కలిసి వినతి పత్రం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News