Wednesday, September 11, 2024

ధరణిలో భారీ కుంభకోణం

- Advertisement -
- Advertisement -

ధరణి పేరుతో బీఆర్‌ఎస్ లీడర్లు భుములు దండుకున్నారని, రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి వివరాలేవి? వాటిని ఎందుకని రేవంత్ సర్కారు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏది? ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవరో ఎందుకు తేల్చడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే, లక్షన్నర లోపు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరమని అన్నారు. రుణమాఫీ సహా ఆరు గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోందని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధమవుతోందిన కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News