Tuesday, September 10, 2024

ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తగూడ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్ ఇంజనీర్ రోహిత్, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో ఉంటున్నారు. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై మసీద్ బండ నుంచి

హఫీజ్‌పేట్ వైపు వెళ్తుండగా కొత్తగూడ ఫ్లైఓవర్‌పై అతివేగంగా బైక్ నడపడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టారు. దీంతో వంతెనపై నుంచి ఇద్దరు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News