Wednesday, September 18, 2024

లీగల్ సెల్‌తో మహిళలకు అందుబాటులోకి చట్టబద్ద సహాయం

- Advertisement -
- Advertisement -

Legal aid available to women with legal cell

 

మహిళల సాధికారతకు సమిష్టి కృషి
జాతీయ మహిళా కమిషన్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నివేదిక

హైదరాబాద్ : మహిళల సంరక్షణ, సాధికారిత కోసం రాష్ట్రంలో మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. 14 రాష్ట్రాల చైర్ పర్సన్‌లకు వివరాలు అందజేశారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన సమీక్ష 14 రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్ పర్సన్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సునీతా లకా్ష్మరెడ్డి పాల్గొని వివరాలు అందజేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న మహిళా సేవా కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో జిల్లాల వారిగా మహిళా కమిషన్ లింగ వివక్షత, సైబర్ క్రైమ్, పని ప్రదేశాల్లో లైంగిక వేదింపులు, మహిళా సాధికారిత, లింగ సమానత్వం, రుతుచక్రం సమయంలో పరిశుభ్రత పాటించడం, గృహ హింస నిరోధక చట్టం తదితర మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళా సాధికారిత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతి, మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల గురించి వివరించారు. కమిషన్ మహిళలకు చేరువుగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సప్ హెల్ప్‌లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదుల గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళల కోసం ఉమఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చెప్పారు. మహిళల రక్షణ, గౌరవం, సాధికారత పౌ అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. మహిళలకు చట్టబద్దమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తేవాలనే లక్షంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ సారథ్యంలో మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల్లో బాలికల హాస్టళ్లు, కళాశాలలు, ఆసుపత్రుల్ని ఆకస్మిక తనిఖీ చేస్తామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎన్‌జివోతో కలిసి వెడ్‌నెస్‌డే వాక్ పేరుతో ప్రతి బుధవారం గ్రామాల్లో లింగ వివక్ష పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతి రావు, కార్యదర్శి కృష్ణ కుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News