Saturday, April 27, 2024

లేలా మరో సంచలనం

- Advertisement -
- Advertisement -

Leylah Fernandez upsets Angelique Kerber at US Open

 

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ మరో సంచలనం సృష్టించింది. మూడో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకాను ఇంటిముఖం పట్టించిన 19 ఏళ్ల ఈ కెనడా అమ్మాయి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మాజీ వరల్ నంబర్‌వన్, 16వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లేలా 4-6, 7-6 (7/5), 6-2తో కెర్బన్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెట్ కోల్పోయి రెండో సెట్‌లో 2-4తో వెనుకబడ్డ లేలా ఎనిమిదో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది. అదే జోరులో నిర్ణాయక మూడో సెట్‌లోనూ దూకుడుగా కెర్బర్ ఆట కట్టించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 7-6 (7/4)తో మాజీ వరల్డ్ నంబర్‌వన్, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6-4, 6-1తో ఎలైజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

మారథాన్ మ్యాచ్

కాగా మరో ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో 17వ సీడ్, గ్సీ క్రీడాకారిణి మారియా సక్కారి 2019 యుఎస్ ఓపెన్ విజేత, కెనడాకు చెందిన బియాంకా ఆండ్రెస్కూ ను 67, 76, 63 స్కోరుతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. మూడున్నర గంటపాటు సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.15 గంటలదాకా సాగడం గమనార్హం. యుఎస్ మహిళల సింగిల్స్ చరిత్రలోనే ఇంత ఆలస్యంగా ముగిసిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు మరో మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ బెటిండా బెన్సిక్ 2020 ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్‌పై 76, 63 స్కోరుతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్ గంటా 24 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బెన్సిక్ బ్రిటన్‌కు చెందిన ఎమ్మా రడుకానుతో తలపడుతుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో ఎమ్మా అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్‌ను ఓడించి క్వార్టర్‌సకు చేరింది. మరో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్లిస్కోవా రష్యాకు చెందిన అనస్టాసిఆ పవ్లిచెంకోవాను 75, 64 స్కోరుతో వరస సెట్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News