Friday, April 19, 2024

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ ముఠాను అదుపులోకి తీసుకుని ముఠాకు చెందిన 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సిపి స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వివరించారు. 14, 190 మంది బాధిత యువతులకు వ్యభిచార రొంపి నుంచి విముక్తి కల్పించామన్నారు. మొత్తం 15 నగరాల నుంచి యువతుల్ని రప్పించిన నిందితులు వెబ్‌సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అ మ్మాయిలను సప్లై చేస్తున్నారని గుర్తించామని తెలిపారు. 39 కేసుల్లో నిందితు ల ప్రమేయం ఉన్నట్లు తేలిందని అన్నా రు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెం దిన అమ్మాయిలతో పాటు విదేశీ మ హిళలతో వ్యభిచారం నడుపుతున్నారని వెల్లడించారు. డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ సె క్స్ రాకెట్‌లో కస్టమర్లకు యువతులను తరలిస్తున్నారని తెలిపారు.

సైబారాబాద్ పరిధిలో ఐదు కేసులు నమోదు చేసి వి చారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా యువతులు, మ హిళల్ని వ్యభిచారంలోకి దింపడంతో పాటు కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ అందిస్తూ ఈ దందా నిర్వహిస్తున్నారన్నారు. నిం దితులు సప్లయర్స్, బ్రోకర్స్ ద్వారా బా ధితులను కస్టమర్ల దగ్గరికి పంపు తున్నారన్నారు. యువతులు, మహిళల్ని విమానాల్లో కూడా వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరికి పంపుతున్నారని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఎపిలతో పాటు ఢిల్లీ, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన వారు బాధితులు ఉన్నారని గుర్తించామన్నారు. అంతేకాదు, నేపాల్, బంగ్లాదేశ్, రష్యాకి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా చేస్తున్నారని తెలిపారు. కాగా, వ్యభిచార నిర్వహణ ద్వారా వచ్చిన నగదులో 30 శాతం బాధిత యువతులు, మహిళలకు, మరో 35 శాతం వెబ్ సైట్ ప్రకటనలకు, మిగిలిన 35 శాతం నగదును నిర్వాహకులు తీసుకుంటున్నారని తెలిపారు.

ఆర్నావ్ అనే వ్యక్తి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో కీలక నిందితుడని సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 915 మంది యువతుల్ని ముంబై, కోల్‌కతా నుండి సప్లై చేసినట్లు గుర్తించామన్నారు. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నారన్నారు. ఎపి, తెలంగాణలలో అనంతపూర్, కరీంనగర్, హైదరాబాద్ కేంద్రాలుగా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని సిపి తెలిపారు. 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్‌లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడన్నారు. హైదరాబాద్ సోమాజీగూడలో ఆర్నావ్‌ను ఓ ప్లాట్‌లో అరెస్ట్ చేశామని, అదే ఇంట్లోనే ఎండిఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ ముఠా కాల్ సెంటర్స్ ఆపరేట్ చేసేవారన్నారు. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్స్ (ప్రతి గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్స్) వినియోగించేవారని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

జాబ్స్ పేరుతో వ్యభిచార దందా

పేదరికంతో ముగ్గుతున్న, ఉద్యోగం లేని యువతులను, మహిళలను జాబ్స్ పేరిట వ్యభిచార రొంపిలోకి దించుతున్నారన్నారు. ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూపులుగా విడిపోయి ఈ దందా చేస్తూ అలాంటి యువతుల్ని వ్యభిచారంలోకి లాగుతున్నారని తెలిపారు. కొన్ని హోటల్స్‌లో పనిచేసే వారి ప్రమేయం కూడా ఈ సెక్స్ రాకెట్‌తో ముడిపడి ఉందని, వారిని కూడా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అరెస్టయిన 17 మంది నిందితులపై పిడి యాక్ట్ ప్రయోగించనున్నట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News